వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన రైతు కొనింటి శంకరప్ప రెండు ఎకరాల్లో సాగు చేసిన వరి పంట బోరు బావిలో నీరు లేక ఎండిపోయింది. చేసేదేమీ లేక ఎండిన పంటను పశువులకు మేతగా వదిలేశాడు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటాయని, జిల్లాలో వరితో పాటు తోటలు, ఇతర పంటలు కూడా ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

