వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో ఆత్మహత్యకు యత్నించిన 41 ఏళ్ల వ్యక్తిని పోలీసులు నాలుగు నిమిషాల్లో చేరుకుని కాపాడారు. కేఆర్‌కే కాలనీకి చెందిన వ్యక్తి కుటుంబ గొడవలతో సోమవారం చెట్టుకు ఉరేసుకునేందుకు యత్నించాడు. స్థానికులు డయల్-100కు సమాచారం అందించారు.
కానిస్టేబుల్ భుజంగ్‌రావు, హోంగార్డు రమేశ్ వెంటనే చేరుకుని చెట్టుపైకి ఎక్కి తాడు తొలగించారు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి రిమ్స్‌కు తరలించారు.
Comments
Loading comments...

