వార్తలకు తిరిగి వెళ్లండి
మధ్యప్రదేశ్ లో యూసీసీ

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జగదీశ్‌పూర్‌లో నేడు ప్రత్యేక క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.
క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం, జూలై 20 నుండి ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ ప్రతిపాదిత యూసీసీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 'ఒకే దేశం, ఒకే చట్టం' విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.
Comments
Loading comments...