Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనం

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 19, 2026 9:15 AM విజయనగరంGeneral
మన్యం జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనం - Udayam
మన్యం జిల్లా పోలీస్ శాఖకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనం అందుబాటులోకి వచ్చిందని జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (APFL) ద్వారా వచ్చిన వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన పరిశీలించారు. వాహనంలో అందుబాటులో ఉన్న పరికరాలు, వాటి పనితీరు, నేరస్థలంలో ఆధారాల సేకరణకు వాటి ఉపయోగం తదితర అంశాలను తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...