వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్ పాలనపై ఎమ్మెల్యే వివేకానంద మండిపాటు
Vikram Jun 20, 2026 6:31 AM హైదరాబాద్ 12 views2 days ago

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను హింసించి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. రైతులకు భరోసా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
రుణమాఫీలో మోసాలకు పాల్పడుతూ, రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ నరకం చూపిస్తోందని వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే, రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...