వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి మండలంలోని మద్దులపల్లి ఎక్స్ రోడ్ నుంచి బతికపల్లి వరకు ఉన్న ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. పలుచోట్ల కంకర తేలి గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు రోడ్డుపైకి రావడంతో ప్రయాణం మరింత కష్టంగా మారింది.
సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

