Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం: డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 27, 2026 11:30 AM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం: డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం - Udayam
మచిలీపట్నంలో దశాబ్దాలుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా కోర్టు సెంటర్‌లో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...