వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని మానకొండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేవల్లి రాజలింగం సూచించారు. ఈదులగట్టుపల్లిలో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,461, బీ-గ్రేడ్‌కు రూ.2,441 మద్దతు ధర అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

