Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లఘు చిత్ర పోటీల్లో తుని విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 11:56 AM కాకినాడGeneral
లఘు చిత్ర పోటీల్లో తుని విద్యార్థుల ప్రతిభ - Udayam
అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యశాఖ నిర్వహించిన లఘు చిత్ర పోటీల్లో తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందుకున్నారు. ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయంగా రూ.20 వేలు, ప్రశంసాపత్రాలు అందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ లలిత, సెల్ కన్వీనర్ విజేతలను అభినందించారు.

Comments

G
Loading comments...