వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్పల్లి మండల కేంద్రంలోని కురుమ యూత్ గణేష్ మండపం వద్ద సోమవారం మహిళలు ఘనంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేపట్టారు.
ఈ సందర్భంగా మండపం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

