Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Follow Udayam Digital on Google
Rohit Agarwal May 30, 2026 5:42 PM హైదరాబాద్తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు - Udayam Digital
కాంగ్రెస్ పాలనపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈసారి పల్లెల నుంచే తిరుగుబాటు మొదలవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన మాట తప్పి రైతుబంధు ఎగ్గొట్టారని, కరెంట్, యూరియా ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు వడ్డీతో సహా చెల్లిస్తామని ముషీరాబాద్ బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...