Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలన అట్టర్‌ఫ్లాప్: కేటీఆర్ విమర్శ

Follow Udayam on Google
Rohit Jun 19, 2026 2:39 PM హైదరాబాద్General
కాంగ్రెస్ పాలన అట్టర్‌ఫ్లాప్: కేటీఆర్ విమర్శ - Udayam
కాంగ్రెస్ పాలన అట్టర్‌ఫ్లాప్‌గా మారిందని, ఆ సినిమాకు ఇంటర్వెల్ సమయం వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మల్కాజ్‌గిరి సమావేశంలో ఆయన మండిపడ్డారు. తమ హయాంలో కరెంట్ కోతలు లేవని గుర్తుచేశారు. వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామన్న రేవంత్ ప్రభుత్వం, 900 రోజులు గడిచినా వాగ్దానాలను నెరవేర్చలేదని, ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...