Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ర వినాయకుని వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 5:58 PM నిర్మల్General
కర్ర వినాయకుని వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన కర్ర వినాయకుని వద్ద సోమవారం యజ్ఞ కార్యక్రమం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం హారతి అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్ర పారిశ్రామిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...