వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా కడమకుంట్లలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో రోళ్లుపాడు తండా జట్టు విజేతగా నిలిచింది. కడమకుంట్ల జట్టు ద్వితీయ స్థానం సాధించింది.
విజేతకు మారిక రాజశేఖర్ రూ.10 వేలు, ద్వితీయ విజేతకు కొండా బ్రదర్స్ రూ.5 వేల నగదు బహుమతులు అందించారు. గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని రాజశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

