వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సాధించవచ్చని ఎస్‌ఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డా. సూర శ్రీనివాసరావు అన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు.
చదరంగంతో ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం మెరుగుపడతాయన్నారు. స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీలో ట్రస్టు సహకారంతో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...

