వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడ 19వ వార్డు భవానీనగర్‌లో గుంతలమయమైన రహదారిపై వర్షపు నీరు నిలవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.
సమస్య చాలాకాలంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వాహనదారులు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

