వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరికిచేడు–గద్వాల మార్గంలోని కొండాపురం, వెంకటాపురం, ఇరికిచేడు రహదారుల గుంతలను మరమ్మతు చేయాలన్న యువ నాయకుడు గాజుల కృష్ణారెడ్డి విజ్ఞప్తికి ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటస్వామి, సిబ్బంది క్షేత్రస్థాయిలో రహదారులను పరిశీలించారు.
మరమ్మతులకు నిధులు మంజూరు చేసి పనులు త్వరగా ప్రారంభించాలని కృష్ణారెడ్డి కోరారు. ఆయన కృషిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

