Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలబురగిలో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 12:05 AM జాతీయంGeneral
కర్ణాటకలోని కలబురగి జిల్లా కమలాపూర్‌ తాలూకా నాగూర్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్న ఇద్దరు మహిళలు మధ్యాహ్న భోజనం చేసేందుకు చెట్టు కింద కూర్చున్నారు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో లక్ష్మీ గుత్తేదార్‌ (48), సైజాద్‌ బీ (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై మహాగావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది

Comments

G
Loading comments...