వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి మండలం సోమరాయణంపేట - బూరుగుపూడి మధ్య భారీ వర్షాల ప్రభావంతో పంట పొలాలు నీటమునిగాయి. పొలాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి.
ఇప్పటికే సాగు చేసిన పంటలు నీటిలో మునిగిపోవడంతో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

