వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండలంలోని పీఎంశ్రీ మస్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఏకంగా 26 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ (NMMS) స్కాలర్‌షిప్‌కు ఎంపికై, రాష్ట్రంలోనే ఈ పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అరుదైన విజయం సాధించినందుకు విద్యార్థులను హైదరాబాద్‌లోని టీశాట్ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానించారు.
2018 నుండి ఇప్పటివరకు మొత్తం 145 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారని హెచ్ఎం జాడి శ్రీనివాస్ తెలిపారు. ప్రణాళికబద్ధంగా చదివితే ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

