వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అత్యున్నత వైద్య సేవలు అందించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఓపీ నమోదు ప్రక్రియ, నూతన క్రిటికల్ కేర్ విభాగాలను పరిశీలించారు.
ఆస్పత్రి రికార్డులను పక్కాగా నిర్వహించాలని, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

