Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీలకు లోక్‌సభ కీలక ఆదేశం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 15, 2026 8:09 PM జాతీయంGeneral
ఎంపీలకు లోక్‌సభ కీలక ఆదేశం - Udayam
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ లోక్‌సభ సచివాలయం కీలక బులెటిన్ జారీ చేసింది. భద్రత, గోప్యత దృష్ట్యా ఎంపీలు సభలోకి స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌గ్లాసులు ధరించవద్దని స్పష్టం చేసింది. సభ ప్రవేశద్వారాల వద్ద ధర్నాలు, ప్లకార్డుల ప్రదర్శనలు, ఏఐ చిత్రాలు, మతపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సభ్యులకు విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...