Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటిషర్లు కూడా అలా చేయలేదు: కేజ్రీవాల్

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 18, 2026 12:00 PM జాతీయంGeneral
బ్రిటిషర్లు కూడా అలా చేయలేదు: కేజ్రీవాల్ - Udayam
లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. గాంధీజీ సుదీర్ఘ ఉపవాసాలు చేసినప్పుడు కూడా బ్రిటీషర్లు ఇంత అనాగరికంగా ప్రవర్తించలేదని ఆయన విమర్శించారు. పేపర్ లీకేజీల నివారణ, పటిష్టమైన విద్యావ్యవస్థ వంటి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న యువతను మోదీ ప్రభుత్వం అవమానిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. సమస్యలను పరిష్కరించడం విడిచిపెట్టి, ఉద్యమాలను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...