Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్ పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలనం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 03, 2026 11:50 AM జాతీయంGeneral
ఇథనాల్ పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలనం - Udayam
దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ప్రవేశపెట్టడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఇదొక ప్రయోగం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ ద్వారా చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ప్రయోగాలనేవి కొన్ని వందల వాహనాలపై చేస్తారు కానీ, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలపై కాదని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఈ నిర్ణయాన్ని అందరికీ తప్పనిసరి చేయడంపై అసలు కేంద్రం కోర్టుకు ఏం చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...