Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గం ఈ-స్టాంప్ కేసులో నివేదిక ఇవ్వండి

Ravi Jun 18, 2026 9:10 AM అనంతపురం 5 views4 days ago
కళ్యాణదుర్గం ఈ-స్టాంప్ కేసులో నివేదిక ఇవ్వండి - Udayam Digital
అనంతపురం ఈ-స్టాంప్ అక్రమాలపై దర్యాప్తు పురోగతిని తెలపాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ లిసాగిల్, జస్టిస్ జయసూర్యల ధర్మాసనం స్పష్టం చేసింది. సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిల్ సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ లాయర్ మాట్లాడుతూ, ఈ కేసులో 36 లావాదేవీలను అనుమానిస్తున్నామని, ఫోరెన్సిక్ రిపోర్టు రాగానే చార్జిషీట్ వేస్తామని తెలిపారు. ఇప్పటివరకు రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Comments

G
Loading comments...