వార్తలకు తిరిగి వెళ్లండి
జూరాల ఆయకట్టుకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. రైతుల సమస్యలపై నిరసనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు సమాచారం.
Comments
Loading comments...

