Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 20న ‘సీజేపీ’ పార్లమెంట్‌ ముట్టడి

Follow Udayam on Google
రవళి దేవి Jul 10, 2026 11:32 AM జాతీయంGeneral
జూలై 20న ‘సీజేపీ’ పార్లమెంట్‌ ముట్టడి - Udayam
పరీక్షల పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) జూలై 20న జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌ వరకు శాంతియుత మార్చ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసేవరకు పోరాడుతామని స్పష్టం చేసింది. మరోవైపు, జంతర్‌మంతర్‌ వద్ద సామాజికవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరాహారదీక్ష 11వ రోజుకు చేరింది. తాను బతికుండాలని కోరుకునే వారంతా ఢిల్లీకి వచ్చి ఈ మార్చ్‌లో పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...