Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 4న రేవంత్ రెడ్డి ‘రాజకీయ కృతజ్ఞత’ సభ

Follow Udayam on Google
rajesh Jul 01, 2026 7:17 PM హైదరాబాద్రాజకీయాలు
జులై 4న రేవంత్ రెడ్డి ‘రాజకీయ కృతజ్ఞత’ సభ - Udayam
ZPTC సభ్యుడి స్థాయి నుండి తెలంగాణ సీఎం వరకు సాగిన తన 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జులై 4న కృతజ్ఞతా సభ నిర్వహించనున్నారు. తన ప్రయాణంలో తొలి అడుగుకు అవకాశమిచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు. ​ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఊరుకొండ ఆలయాన్ని దర్శించుకొని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన ఆత్మీయులు, స్థానిక నేతలతో కలిసి భోజనం చేయనున్నారు.

Comments

G
Loading comments...