Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడుగులో కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:43 PM కడపGeneral
జమ్మలమడుగులో కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన - Udayam
జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్ల దుస్తులతో నిరసన చేపట్టారు. దశాబ్ద కాలంగా పనిచేస్తున్న తమను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. రెగ్యులర్ చేసే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, కరోనా బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని JAC కోరింది.

Comments

G
Loading comments...