వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండపల్లి మండలం గొల్లకోట మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రూ.21.36 లక్షల ఆర్థిక సాయం అందించారు.
బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం తరఫున రూ.10 లక్షలు, నియోజకవర్గ నాయకులు సేకరించిన రూ.11.36 లక్షలతో కలిపి చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జగన్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Loading comments...

