Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ మహాసభల పోస్టర్లు విడుదల

Follow Udayam on Google
p.g.murthy Sep 21, 2026 5:24 PM మంచిర్యాలGeneral
జాతీయ మహాసభల పోస్టర్లు విడుదల - Udayam
ఖమ్మం పట్టణంలో నిర్వహించే ఏఐకేఎంఎస్ నాలుగవ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లాల్ కుమార్ కోరారు. సోమవారం మధ్యాహ్నం హాజీపూర్ మండలంలోని ర్యాలీగడ్పూర్, మొర్రిగూడెం గ్రామాలలో జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో ఖమ్మంలో జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఆ కార్యక్రమానికి అందరూ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...