Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్ బెదిరింపులపై ఇరాన్ తీవ్ర హెచ్చరిక

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 01, 2026 4:57 PM జాతీయంGeneral
ఇజ్రాయెల్ బెదిరింపులపై ఇరాన్ తీవ్ర హెచ్చరిక - Udayam
తమ దేశ నాయకత్వంపై ఎలాంటి ముప్పు వచ్చినా తక్షణమే, అత్యంత శక్తివంతంగా స్పందిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ హెచ్చరించారు. తమను లక్ష్యంగా చేసుకుంటే బుద్ధి చెబుతామని ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఆయన సామాజిక మాధ్యమం 'X' లో పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని అంతమొందిస్తామన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు, కాల్పుల విరమణ, నౌకాయానంపై ఇరుదేశాలు దోహాలో సాంకేతిక చర్చలు జరుపుతున్నాయి.

Comments

G
Loading comments...