వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర తెలంగాణల్లో 80కిపైగా ఇంటి దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను పెందుర్తి నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 14 గ్రాముల బంగారం, 9.5 కిలోల వెండి, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
సుజాతనగర్ ఇంటి చోరీ, పీఎంపాలెం బంగారం దుకాణం చోరీ కేసుల దర్యాప్తులో నిందితులు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.23 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

