Back to feed
శ్రీవారి ప్రసాదానికి అంతర్జాతీయ గౌరవం: లడ్డూకు ‘జీఐ’ ట్యాగ్
Ravi Singh Jun 03, 2026 8:37 AM తిరుపతి 9 viewsabout 16 hours ago

తిరుపతి లడ్డూకు కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) గుర్తింపును మంజూరు చేసింది. దీనితో పాటు లడ్డూ నాణ్యత, ప్రమాణాల పరిశీలన అనంతరం టీటీడీకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ కూడా లభించింది. ప్రసాదాల తయారీలో మలినాలను తొలగించేందుకు ప్రస్తుతం అత్యాధునిక ఏఐ యంత్రాలను వినియోగిస్తున్నారు.
1950 నాటి సాంప్రదాయ ‘దిట్టం’ ప్రకారమే 700 మంది సిబ్బందితో నిరంతరాయంగా లడ్డూల తయారీ సాగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా నిత్యం 8 నుండి 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుతున్నారు.
Comments
Loading comments...


