Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-పాక్ మధ్య అనధికారిక శాంతి చర్చలు!

అనురూప్ గౌడ్ Jul 02, 2026 1:02 AM అల్ ఇండియా 6 viewsabout 3 hours ago
భారత్-పాక్ మధ్య అనధికారిక శాంతి చర్చలు! - Udayam Digital
దశాబ్దాల శత్రుత్వాన్ని వీడి భారత్-పాకిస్థాన్ శాంతి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మాజీ అధికారులు, దౌత్యవేత్తలు శ్రీలంకలోని కొలంబోలో అనధికారికంగా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. పాక్‌తో చర్చలకు భారత్ సిద్ధంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ చర్చల్లో తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ నేత రాంమాధవ్ ఖండించారు.

Comments

G
Loading comments...