Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు: విద్యాసంస్థలకు సెలవు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 02, 2026 8:43 AM జాతీయంGeneral
ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు: విద్యాసంస్థలకు సెలవు - Udayam
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ముందస్తు జాగ్రత్తగా పన్వెల్, పాల్ఘర్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...