వార్తలకు తిరిగి వెళ్లండి
క్రీడలుBreaking
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
విష్ణు వర్ధన్ Jun 25, 2026 4:55 PM అల్ ఇండియా 17 viewsabout 12 hours ago

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా 25 బంతులు మిగిలి ఉండగానే (16.5 ఓవర్లలో 139/5) ఛేదించింది.
జెమిమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 26) మెరుపులు మెరిపించగా.. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13 నాటౌట్), దీప్తి శర్మ (5 నాటౌట్) బౌండరీలతో మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం వైపు దూసుకెళ్తోంది.
Comments
Loading comments...