వార్తలకు తిరిగి వెళ్లండి

2026 వరల్డ్ రోయింగ్ కప్- IIIలో భారత ఆర్మీ అథ్లెట్లు ఉజ్వల్ కుమార్, లక్షయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. లైట్ వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ ఫైనల్‌లో ఈ జోడీ 6:26.09 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి భారత్‌కు తొలిసారి బంగారు పతకం అందించింది.
హాంకాంగ్, నెదర్లాండ్స్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత ఆర్మీ రోయింగ్ క్రీడాకారులకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహం, అంతర్జాతీయ సదుపాయాల వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైంది.
Comments
Loading comments...

