వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివారం రాత్రి కలుషిత ఆహారం తిని బీర్కూర్ లో వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాలలో 20 మంది విద్యార్థులు బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జిల్లా వైద్యాధికారి వెంకట్ మంగళవారం విద్యార్థులను పరిమర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అడిగి తెలుసుకున్నారు. అందరూ విద్యార్థులు కోల్కున్నారని త్వరలో డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించినట్లు జిల్లా వైద్యాధికారి వెంకట్ వెల్లడించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మంగళవారం విద్యార్థికి డిశ్చార్జ్ చేయనున్నట్లు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలను వివరించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆయన వెంట వైద్యాధికారులు సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

