Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ సంచలనం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 01, 2026 5:54 PM జాతీయంక్రీడలు
ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ సంచలనం - Udayam
టీజీ20 లీగ్‌లో భాగంగా వరంగల్ వారియర్స్‌తో బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. వరుసగా ఐదో విజయంతో టోర్నీలో తమ జైత్రయాత్రను విజయవంతంగా కొనసాగించింది. వరంగల్ విధించిన 174 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 15.3 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి కేవలం 43 బంతుల్లోనే 101 పరుగులతో అజేయ సెంచరీ సాధించి జట్టును గెలిపించారు.

Comments

G
Loading comments...