Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా నౌకలపై దాడులు చేయబోం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 10:15 AM అంతర్జాతీయంGeneral
అమెరికా నౌకలపై దాడులు చేయబోం - Udayam
ఎర్ర సముద్రంలో అమెరికా సహా ఇతర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హూతీ నేత మొహమ్మద్ అల్ బుఖైతీ ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే అమెరికాతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇతర దేశాలు సౌదీ అరేబియాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా వ్యవహరించనంత వరకు ఘర్షణకు దిగబోమన్నారు. బాబ్ అల్‌-మండేబ్ జలసంధిని మూసివేసే ఉద్దేశం లేదని, అందరికీ స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...