వార్తలకు తిరిగి వెళ్లండి
బిహార్‌లో 'హెలి టూరిజం-2026' షురూ

బిహార్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు సీఎం సమ్రాట్ చౌధరీ 'హెలి టూరిజం-2026' పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో పట్నా నుండి రాజ్ గిర్, వాల్మీకినగర్, కైముర్‌లకు తక్కువ ధరలోనే హెలికాప్టర్ ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ వినూత్న పథకం కింద ఒక్కో ప్రయాణికుడిపై రూ.15,422 వరకు రాయితీని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం తెలిపారు. బుకింగ్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...