Back to feed
హవాలా సొమ్ము పట్టివేత
Ravi Kumar May 28, 2026 12:00 PM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ.1.22 కోట్ల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఈ సొమ్మును తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన విజయ్ అంబాదాస్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నగదును సికింద్రాబాద్ మోండామార్కెట్‌లోని ఓ వ్యాపారికి అప్పగించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. బ్యాగులో సరైన రసీదులు లేకపోవడంతో నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.
Comments
Loading comments...



