వార్తలకు తిరిగి వెళ్లండి
పేదలకు అండగా ప్రభుత్వం: ఎనిమిది మందికి సీఎం సహాయనిధి అందజేత
Kumar Jun 22, 2026 7:04 AM విజయనగరం 1 viewsabout 2 hours ago

బొబ్బిలి నియోజకవర్గంలో ఎనిమిది మంది బాధితులకు ఎమ్మెల్యే బేబీ నాయన సోమవారం సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. సుమారు రూ.5.3 లక్షల ఆర్థిక సాయం లబ్ధిదారులకు దక్కింది. బొబ్బిలి కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...