Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకులం షెడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 29, 2026 7:04 PM విజయనగరంGeneral
గోకులం షెడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన - Udayam
ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారీ మంగళవారం పల్లె పండుగ 3.O లో భాగంగా జామి మండలం చింతాడ గ్రామంలో రూ.20.25 లక్షల విలువైన ఏడు గోకులం షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థిక స్వావలంబన కోసం గోకులం షెడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అనంతరం ఆమె పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Comments

G
Loading comments...