Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు శుభవార్త: నేడే 'రైతు భరోసా' నిధుల విడుదల

శరణ్య శర్మ Jun 30, 2026 1:16 AM హైదరాబాద్ 4 viewsabout 1 hour ago
రైతులకు శుభవార్త: నేడే 'రైతు భరోసా' నిధుల విడుదల - Udayam Digital
వానాకాలం సీజన్‌కు సంబంధించి రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను నేడు సీఎం రేవంత్ రెడ్డి జమ చేయనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తంగా 73.32 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్లు దశలవారీగా అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నిధులను రుణ బకాయిల కింద మినహాయించుకోవద్దని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది.

Comments

G
Loading comments...