వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌కు గడువు సోమవారంతో ముగియనుంది. రాష్ట్రంలో 3,650 షాపుల లైసెన్సుల రెన్యువల్‌కు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నిన్న (ఆదివారం) సాయంత్రం 6 గంటల వరకు 2,993 మంది (82%) దరఖాస్తు చేసుకున్నారు.
కొందరు పూర్తి, మరికొందరు పాక్షికంగా రుసుము చెల్లించగా.. ప్రభుత్వానికి రూ.770.3 కోట్ల ఆదాయం సమకూరింది. ఇంకా 657 షాపులకు దరఖాస్తులు రావాల్సి ఉంది.
Comments
Loading comments...

