వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి నెలలోనే వర్షపాతం 40 శాతం క్షీణించడంతో జులైలోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తీవ్ర వర్షభావం వల్ల దేశంలో పంటల దిగుబడి గణనీయంగా పడిపోయి, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు క్షీణించి మార్కెట్లో వస్తువుల డిమాండ్ పడిపోనుంది. ఇదే సమయంలో ఆహార సంక్షోభం తలెత్తి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

