వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి DOST స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత ఫైలుపై ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది చేరగా, మరో 2.50 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.
గతేడాది మాదిరిగానే స్థానికేతర విద్యార్థులకు కూడా అవకాశం కల్పించే ప్రతిపాదన ఉంది. పూర్తి షెడ్యూల్‌ను ఈ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

