Back to feed
మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ: సీఎం రేవంత్
Rajdeep Sardesai Jun 08, 2026 1:21 PM హైదరాబాద్ 9 viewsabout 2 hours ago

మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను కేటాయించింది. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ బస్సులను పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణారావు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌లతో సమీక్ష నిర్వహించారు. సభకు హాజరయ్యే మహిళలకు తాగునీరు, భద్రత, మొబైల్ టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

